హైకమాండ్, సీఎం రేవంత్‌‌‌‌కు రుణపడి ఉంటా : వైస్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి

హైకమాండ్, సీఎం రేవంత్‌‌‌‌కు రుణపడి ఉంటా :  వైస్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి
  •     రాష్ట్ర ప్లానింగ్ బోర్డు కొత్త  వైస్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌‌‌‌కు, రాష్ట్ర నాయకత్వానికి రుణపడి ఉంటానని ప్లానింగ్ బోర్డు కొత్త వైస్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్‌‌‌‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌‌‌‌కు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 

‘‘నాకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేస్తాను” అని గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో మరింత బాధ్యతగా ముందుకు సాగుతానని వివరించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా లభించిన ఈ అవకాశాన్ని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగించుకుంటానని, రాష్ట్ర సమగ్ర సుస్థిర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె వెల్లడించారు.