మద్దూరు/నకిరేకల్, వెలుగు : నారాయణపేట జిల్లా మద్దూరులో 4న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో హెలిప్యాడ్, డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాల తదితర మార్గాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. మద్దూరు పట్టణ సమీపంలోని కోస్గి రోడ్డు సమీపంలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు.
5న నకిరేకల్ నియోజకవర్గంలో సీఎం పర్యటన సందర్భంగా మినీ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. వేదిక నిర్మాణం, తాగునీరు, పార్కింగ్, భద్రత, విద్యుత్ సౌకర్యం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు, మున్సిపల్, పోలీస్, ఆర్ అండ్ బి శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
