భార్యతో విభేదాలు.. కూకట్పల్లిలో ప్రాణం తీసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్

భార్యతో విభేదాలు.. కూకట్పల్లిలో ప్రాణం తీసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్

కూకట్​పల్లి, వెలుగు: భార్యతో చిన్న చిన్న విభేదాల కారణంగా మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్​వేర్​ఇంజినీర్​సూసైడ్​చేసుకున్నాడు. ఈ ఘటన కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. కొత్తగూడెం పట్టణానికి చెందిన రమేశ్(40) భార్య రాధికతో కలిసి కూకట్​పల్లి దేవినగర్​లో ఉంటూ సాఫ్ట్​వేర్ ​ఇంజినీర్​గా చేస్తున్నాడు.

మంగళవారం భార్య పుట్టినరోజు కావడంతో ఆమె అక్క, తమ్ముడు వీరు ఉంటున్న అపార్ట్​మెంట్​కు వచ్చారు. రాత్రి డిన్నర్​ చేసేందుకు ట్యాంక్​బండ్​కు వెళ్దామనుకున్నారు. దీనికి రమేశ్​ నిరాకరించాడు. దీంతో మిగతావారు బయటకు వెళ్లారు. తర్వాత గదిలో ఒంటరిగా ఉన్న రమేశ్​అర్ధరాత్రి 12.30 గంటలకు భార్య రాధికకు ‘పొరపాటు జరిగింది.. సారీ.. గుడ్​బై’ అని మెసేజ్​ పెట్టాడు.

ఇది చూసిన భార్య, కుటుంబ సభ్యులు వచ్చి చూసే సరికే రమేశ్​ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.