జస్ట్ 2 రోజుల్లో తులం రూ.4వేల 250 పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో రేట్లు ఇవే

జస్ట్ 2 రోజుల్లో తులం రూ.4వేల 250 పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో రేట్లు ఇవే

గతవారం నేలచూపులు చూసిన బంగారం, వెండి రేట్లు ఈవారం మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తోడుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ, బాండ్ మార్కెట్లలోని పరిస్థితులు, డాలర్ బలహీనత ఇన్వెస్టర్లను తిరిగి గోల్డ్ వైపు నడిపించటం సామాన్యులకు గోల్డ్ అందని ద్రాక్షలా మార్చేస్తోంది. ఈ క్రమంలో ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ చేయాలనుకుంటున్నట్లయితే తమ సమీపంలోని నగరాల్లోని రేట్లను ముందుగా పరిశీలించటం చాలా ముఖ్యం. 

సెప్టెంబర్ 4న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ 2 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.131 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 666గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 360గా కొనసాగుతోంది. 

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 4, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీ రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర ఉంది.