దిగొస్తున్న చక్కెర ధరలు..వారంలో 3.85 శాతం తగ్గుదల

దిగొస్తున్న చక్కెర ధరలు..వారంలో 3.85 శాతం తగ్గుదల

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దిద్దుబాటు చర్యలతో దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో చక్కెర ధరలు తగ్గుముఖం పట్టాయి. అధికారిక గణాంకాల ప్రకారం, సగటు ధర వారంలో 3.85శాతం తగ్గి కిలోకు  రూ.62.57కి చేరింది. గత వారం ఇది రూ.65.08గా నమోదైంది. అయినప్పటికీ, గత నెల నాటి రూ.49.33తో పోలిస్తే ప్రస్తుత ధరలు ఇంకా 27శాతం ఎక్కువే ఉన్నాయి. హోల్‌‌‌‌‌‌‌‌సేల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోనూ చక్కెర ధర క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు సగటున రూ.60.39 నుంచి రూ.57.62కి పడిపోయింది. 

హోల్‌‌‌‌‌‌‌‌సేల్ తగ్గుదల పూర్తిస్థాయిలో రిటైల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు చేరడానికి కనీసం పది రోజుల సమయం పడుతుందని వ్యాపార వర్గాలు తెలిపాయి. పాత నిల్వలు అయిపోయిన తర్వాతే కొత్త ధరలు పూర్తిగా అమల్లోకి వస్తాయి. ధరల పెరుగుదలను అరికట్టేందుకు కేంద్రం 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతులకు అనుమతినివ్వడంతో పాటు డీలర్లు, బల్క్ వినియోగదారులపై స్టాక్ నిబంధనలను కఠినతరం చేసింది. 2025–26 సీజన్ ఉత్పత్తి అంచనా 306 లక్షల టన్నులకు తగ్గినప్పటికీ, దేశీయ డిమాండ్ (280–285 లక్షల టన్నులు) కంటే నిల్వలు సమృద్ధిగానే ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.