కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బోడుప్పల్లో బైక్ ర్యాలీ
మేడిపల్లి, వెలుగు: బీఆర్‌ఎస్ పాలనలో కుటుంబ పాలన, దొరల పెత్తనం సాగిందని మేడ్చల్‌డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్‌యాదవ్ ఆరోపించారు. తుపాకులు గురిపెట్టి ఆస్తులు లాక్కోవడం, వ్యాపారులను బెదిరించే సంస్కృతి బీఆర్‌ఎస్ దేనని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, కాంగ్రెస్‌నాయకులతో కలిసి బోడుప్పల్ సర్కిల్ పరిధిలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు.
కమాన్‌వద్ద సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
