రెండున్నరేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపించాం: నాయిని రాజేందర్ రెడ్డి

రెండున్నరేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపించాం: నాయిని రాజేందర్ రెడ్డి

గ్రేటర్​ వరంగల్, వెలుగు: పదేళ్లలో జరగని అభివృద్ధిని రెండున్నరేళ్లలో చేసి చూపించామని వరంగల్​పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండలోని  డీసీసీ భవన్ ఎదుట వెయ్యి రోజుల ప్రజాపాలన సందర్భంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకుందన్నారు.

గత పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని ప్రజలు స్వయంగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట వేసిందన్నారు. వరంగల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌, అండర్‌‌‌‌గ్రౌండ్ డ్రైనేజీ, సిటీ మాస్టర్ ప్లాన్, కాలేజీలు, కలెక్టరేట్, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల అభివృద్ధి.. వంటి ఎన్నో ప్రాజెక్ట్‌‌‌‌లను ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ వెంకట్రామ్‌‌‌‌రెడ్డి, జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.