యాదగిరిగుట్ట, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సాధ్యంకాని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నరేండ్లలోనే చేసి చూపించిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. గురువారం యాదగిరిగుట్టలో నిర్వహించిన ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఆత్మ కమిటీ చైర్మన్ గా సుధాకర్ తో పాటు 30 మంది సభ్యులు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అయిలయ్య మాట్లాడుతూ గందమల్ల రిజర్వాయర్ పనులు వేగవంతం చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై, కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనపై ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చకు రావాలని ఆమెకు సవాల్ విసిరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ చైతన్యా మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చీర శ్రీశైలం, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి కానుగు బాలరాజు గౌడ్ తదితరులు ఉన్నారు.
