కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే మందుల సామెల్

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తి, వెలుగు : ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. గురువారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తోందని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ ఇండ్లు ఇవ్వలేదని, ఇప్పుడు ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.