స్కూల్లో బ్రేక్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

స్కూల్లో బ్రేక్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

ధర్మసాగర్, వెలుగు: దేశంలోనే స్కూల్‌‌‌‌ విద్యార్థులకు అల్పాహారం ప్రవేశం పెట్టిన రాష్ట్రం తెలంగాణ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాషాగూడెం గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌‌‌‌లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌‌‌‌పాయ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు ఎమ్మెల్యే , కలెక్టర్  స్వయంగా విద్యార్థులకు రుచికరమైన అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం చిన్నారుల మధ్య కూర్చొని వారితో ముచ్చటిస్తూ బ్రేక్ ఫాస్ట్ చేశారు. స్కూల్‌‌‌‌ ఆవరణలోరూ.12లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులు ఆకలితో ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి అలోచించి పోషకవిలువలతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నట్లు
 చెప్పారు