ఇన్ముల్ నర్వ భూముల వేలంలో రూ.6.57 కోట్ల ఆదాయం

ఇన్ముల్ నర్వ భూముల వేలంలో రూ.6.57 కోట్ల ఆదాయం
  • రెండో రోజు 20 ప్లాట్ల అమ్మకం

హైదరాబాద్​సిటీ, వెలుగు: హెచ్​ఎండీఏ భూముల వేలంలో భాగంగా రెండో రోజు గురువారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్​నర్వలో వేలం నిర్వహించారు. ఈ లేఅవుట్​లో 60 ప్లాట్లను అధికారులు అమ్మకానికి పెట్టారు. 

ఇందులో 20 ప్లాట్లను వేలం వేయగా రూ.6.57 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గరిష్ఠంగా చదరపు గజానికి రూ.21 వేల ధర పలికిందన్నారు. అలాగే, చదరపు గజానికి సగటు ధర రూ.16,725గా నమోదైనట్లు పేర్కొన్నారు.