15  సెకన్లలోనే ..1500 బస్తాల యూరియా బుకింగ్!

15  సెకన్లలోనే ..1500 బస్తాల యూరియా బుకింగ్!

నిజాంపేట, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఎరువుల సేవలను సులభతరం చేయడానికి తీసుకొచ్చిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజాంపేట పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాలకు కేటాయించిన 1500 యూరియా బస్తాల కోసం గురువారం ఉదయం నుంచి ఫోన్లు పట్టుకుని ఎదురుచూసిన రైతులు, ఉదయం 9:05 గంటలకు యాప్ ఓపెన్ కాగానే కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే బుకింగ్స్ అన్నీ పూర్తయిపోవడంతో ఆందోళన చెందారు.

సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌‌‌‌వర్క్ సమస్యలు ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఈ విధానం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ యాప్ విధానాన్ని సమీక్షించి, పాత పద్ధతిలోనే నేరుగా ఎరువులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, యాప్‌‌‌‌లో యూరియా బుక్ చేసుకున్న రైతులు నిజాంపేట పీఏసీఎస్​ వద్ద క్యూలైన్లలో గంటల తరబడి నిల్చుని యూరియా బస్తాలను తీసుకెళ్లారు.