సంగారెడ్డి లో పర్మిషన్ లేని క్లినిక్స్సీజ్

సంగారెడ్డి లో పర్మిషన్ లేని క్లినిక్స్సీజ్

సంగారెడ్డి(హత్నూర), వెలుగు :  మండల కేంద్రమైన హత్నూర, దౌల్తాబాద్ లోని  ప్రథమ చికిత్స కేంద్రాలు, క్లినిక్ ల్యాబ్ లను  గురువారం జిల్లా నిరోధక అధికారి(డీఐఓ) శశాంక్ దేశ్ పాండే  ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే క్లినిక్ లను సీజ్ చేసి, ల్యాబ్ లకు జరిమానా విధించినట్లు ఆయన పేర్కొన్నారు. హత్నూరలో 4, దౌల్తాబాద్ లో 4 క్లినిక్, రెండు ల్యాబ్ లకు రూ, 25 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. తనిఖీల్లో వైద్యాధికారులు రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు.