ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి: మంచిర్యాల వైద్యాధికారి

ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి: మంచిర్యాల వైద్యాధికారి

లక్సెట్టిపేట, వెలుగు: ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని  మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ స్పష్టం చేశారు. లక్సెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట పీహెచ్​సీ పరిధిలోని 40 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు రూ.20 వేల విలువైన పౌష్టికాహార కిట్స్​ను ఆర్ఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. జిల్లా ఉప వైద్యారోగ్యశాఖ అధికారి సుధాకర్ నాయక్, పీహెచ్​సీ మెడికల్ ఆఫీసర్ సమత, ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు మంతెన రమేశ్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు రాయలింగు, కోశాధికారి వి.రాజు పాల్గొన్నారు.