సింగరేణి అడ్రియాల ప్రాజెక్టులో పేలిన ట్యాంక్..ఐదుగురు కార్మికులకు గాయాలు

సింగరేణి అడ్రియాల ప్రాజెక్టులో పేలిన ట్యాంక్..ఐదుగురు కార్మికులకు గాయాలు

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సింగరేణి అడ్రియాల లాంగ్ వాల్ (ఏఎల్​పి) మైన్​ప్రాజెక్టులో గురువారం ఉదయం ఎయిర్ ట్యాంక్ పేలడంతో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... ప్రాజెక్టులోని ఎస్ బీఎల్ ఎయిర్​ట్యాంక్​ కంప్రెషర్ లో కార్మికులు ఎయిర్​నింపుతుండగా అది లీక్ అయింది. భారీ శబ్దంతో ట్యాంక్ బ్లాస్ట్ కావడంతో ఆయిల్ బయటకు వచ్చి కార్మికుల మీద పడింది.

దీంతో ఫిట్టర్​పి.కిరణ్​కుమార్, ఎస్డీఎల్ ఆపరేటర్​వి.శ్రీనివాస్, జనరల్​అసిస్టెంట్లు సీహెచ్. ప్రశాంత్, టి.మనోజ్ కుమార్, ఆర్.లక్ష్మణ్ స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారిని సెంటినరీ కాలనీలోని సింగరేణి డిస్పెన్సరీకి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం గోదావరిఖనిలోని ఏరియా హాస్పిటల్​కు తరలించారు. భారీ శబ్ధం కారణంగా ఎవరికైనా వినికిడి సమస్య వచ్చిందా అనే విషయం తెలుసుకునేందుకు డాక్టర్లు పరీక్షలు చేశారు.