- లక్షల్లో ఖర్చయ్యే ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ..
- క్లిష్టమైన సర్జరీ చేసి డెయిలీ లేబర్‌కు ప్రాణాలు పోసిన డాక్టర్లు
పంజాగుట్ట, వెలుగు : నిమ్స్దవాఖాన కార్డియాలజిస్టులు అరుదైన గుండె సర్జరీ విజయవంతంగా నిర్వహించి శభాష్అనిపించుకున్నారు. అరుదైన సమస్యతో బాధపడుతున్న ఓ హార్ట్పేషెంట్కు త్రీడీ ఎలక్ట్రో అనాటమికల్ మ్యాపింగ్ టెక్నాలజీతో సర్జరీ చేశారు. ఈ ఆపరేషన్‌ను ఆరోగ్యశ్రీ కింద నిర్వహించి 30 ఏళ్ల డెయిలీ లేబర్‌కు ప్రాణాలు పోశారు.
మారుమూల ప్రాంతంలో డెయిలీ లేబర్..
మన రాష్ట్రంలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన డెయిలీ లేబర్ రెండేండ్ల కింద పని చేస్తున్నప్పుడు తీవ్రమైన ఆయాసంతో ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో అప్పు చేసి ఓ కార్పొరేట్ దవాఖానకు వెళ్లాడు. అక్కడ పరీక్షలు చేయగా వెంట్రిక్యులర్ప్రీమెచ్యూర్కాంప్లెక్సెస్ సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. డబ్బులు లేక ట్రీట్మెంట్చేయించుకోకపోవడంతో గుండె పంపింగ్ తగ్గిపోయింది. ఒక హాస్పిటల్లో 24 గంటల హోల్టర్ మానిటరింగ్ టెస్ట్చేయగా 57 శాతం అబ్నార్మల్హార్ట్బీట్ఉన్నట్టు తేలింది. ప్రైవేట్‌లో వైద్యం చేయించుకోలేక, ప్రాణాలు పోయే స్థితిలో అతడు నిమ్స్ ను ఆశ్రయించాడు.
సవాలును స్వీకరించిన డాక్టర్లు
సర్జరీ అత్యంత సవాలుతో కూడుకున్నప్పటికీ కార్డియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఓ సాయి సతీష్ నేతృత్వంలోని డాక్టర్ల టీమ్సిద్ధమైంది. గత నెల ఆగస్టు 24న ప్రొసీజర్స్టార్ట్చేశారు. త్రీడీ మ్యాపింగ్ ద్వారా పరీక్షించగా అబ్నార్మల్హార్ట్బీట్కు కారణమైన కేంద్ర స్థానం అయోర్టిక్ వాల్వ్ లోపల, లెఫ్ట్కరోనరీ ఆర్టరీ దగ్గర ఉందని గుర్తించారు. ఈ ప్లేస్‌లో రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (కాల్చడం) చేయడం ప్రమాదకరం. చిన్నపొరపాటు జరిగినా ఎయోర్టాకు (ప్రధాన రక్తధమని) గాయమై ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్లు కరోనరీ యాంజియోగ్రఫీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, రేడియోఫ్రీక్వెన్సీ పవర్‌ను ఒక్కసారి కాకుండా క్రమక్రమంగా పెంచుతూ ఎయోర్టాకు హాని కలగకుండా సమస్య ఏర్పడిన ప్రాంతంలో ఆబ్లేషన్నిర్వహించారు.
నార్మల్‌గా హార్ట్ బీట్
కోత లేని సర్జరీ తర్వాత క్రమక్రమంగా కోలుకున్న యువకుడు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆపరేషన్ తర్వాత ఈసీజీ, హోల్టర్ పరీక్షలు చేయగా ఇప్పుడు అతడి హార్ట్బీట్పూర్తి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ ఆపరేషన్‌లో డాక్టర్ సాయి సతీష్‌తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ హేమంత్, డాక్టర్ నియుషా, సీనియర్ రెసిడెంట్లు డాక్టర్ జగదీష్, డాక్టర్ సాయి హరి పాల్గొన్నారు.
