గట్టుప్పల్, వెలుగు: గట్టుప్పల్ మండలంలో లచ్చమ్మగూడెం నుంచి అంతంపేట వరకు రూ.10.76 కోట్లతో, అంతంపేట నుంచి శివన్నగూడెం వరకు రూ.13.50 కోట్లతో మొత్తం రూ.24.26 కోట్లతో చేపట్టనున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇండ్ల నిర్మాణం నిలిచిపోయిందని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
దీనికి ఆయన వెంటనే స్పందిస్తూ ఐదుగురు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున తన సొంత నిధులను అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విరమల్ల శ్రీశైలం, రాష్ట్ర నాయకుడు జక్కిలి ఐలయ్య యాదవ్, సర్పంచ్‌లు చందా శ్రీలత వెంకటేశం, నామని జగన్నాధం, బీమనవల్లి రామయ్య, కాంగ్రెస్ నాయకులు కంచుకట్ల సంపత్, మండల ఉపాధ్యక్షుడు రావుల రమేశ్తదితరులు పాల్గొన్నారు.
