ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ భేటీ

ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ భేటీ
  •     తాజా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. గురువారం ఢిల్లీ రాజాజీ మార్గ్ లోని ఖర్గే నివాసంలో ఆయనతో భట్టి, ఉత్తమ్ వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అంతర్గత వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరుపై చర్చించారు. 

అదేవిధంగా కొండా సురేఖ ఎపిసోడ్ మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాగా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఖర్గే దిశానిర్దేశం చేశారు.