గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని సింగరేణి రామగుండం రీజియన్లోని జీడీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు-5 బొగ్గు డిస్పాచ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. గతంలోనూ పలు రికార్డులను సొంతం చేసుకున్న జీడీకే ఓసీ-5 తాజాగా మరో ఘనతను నమోదు చేసింది. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో బుధవారం ఒక్కరోజే 13,024 టన్నుల బొగ్గును రవాణా చేసింది. సెప్టెంబర్ 2న 8,907 టన్నుల బొగ్గు రవాణా చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఏకంగా 13,024 టన్నులతో 146 శాతం డిస్పాచ్ చేసింది. కార్మికులు, అధికారుల సమిష్టి కృషి తోనే ఇది సాధ్యమవుతుందని రామగుండం ఏరియా 1 జీఎం లలిత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
