కోల్బెల్ట్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని మంచిర్యాల అడిషనల్కలెక్టర్ పి.చంద్రయ్య సూచించారు. బ్లూ డాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మందమర్రిలోని జడ్పీ బాయ్స్హైస్కూల్30 మంది విద్యార్థులకు గురువారం ఆయన సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, ఎంఈవో రమేశ్, బ్లూ డాన్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.
