కరీంనగర్ పట్టణంలో అగ్నిప్రమాదం జరిగింది. జగిత్యాల రోడ్డులోని విశ్వ బేకరీలో శుక్రవారం (సెప్టెంబర్4) ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బేకరీ మొత్తం మంటలు వ్యాపించి వస్తువలన్నీ కాలిబూడిదయ్యాయి. ఒక్కసారిగా మంటల చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్ తో మంటలను అదుపులోకి తెచ్చారు. బేకరీ ఇండ్ల మధ్య ఉండటంతో సకాలంలో ఫైర సిబ్బంది మంటలార్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలిసి రాలేదు.
