పెండింగ్ పనులు వేగవంతం చేయాలి..ఆర్‌‌‌‌ అండ్‌‌‌‌ బీ శాఖపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

పెండింగ్ పనులు వేగవంతం చేయాలి..ఆర్‌‌‌‌ అండ్‌‌‌‌ బీ శాఖపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం సెకట్రేరియెట్‌లో ఆర్‌ అండ్‌ బీ శాఖ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రోడ్లు, భవనాల అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్‌ పనులు, కొత్త ప్రాజెక్టులు, పనుల నాణ్యత, అలాగే నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసే అంశాలపై అధికారులతో చర్చించారు. 

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడంతో పాటు, రాష్ట్రంలో రోడ్ల మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులను వేగవంతం చేయాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ శాఖ స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌ రాజ్, సీఈలు బీవీ రావు, ధర్మారెడ్డి, రాజేందర్‌, నర్సింగా రావు, రాజేశ్వర్‌ రెడ్డి, వనజ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.