నెట్వర్క్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేపట్టి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, మెదక్జిల్లాల్లోని పలు పట్టణాల్లో పార్టీ నేతలు భారీ విజయోత్సవ బైక్ ర్యాలీలు నిర్వహించారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని నాయకులు తెలిపారు.
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రజా పాలనపై బీఆర్ఎస్ నిరసనలు చేపట్టడం హాస్యాస్పదమన్నారు
