ఏడుగురు మహిళల జీవితాల నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్నారు. పృథ్వి దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇంటర్నేషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతూనే, రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, వ్యక్తిగత అనుభవాలు, ఓ ప్రయాణంలో ఏర్పడే బంధాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, సినిమా కూడా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అన్నారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
