భారత మాజీ ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో కొత్త ప్రయాణం ప్రారంభించారు. భారత సైన్యంలో గ్రూప్ కెప్టెన్ పదవీ విరమణ తర్వాత ఇప్పుడు గోవా ప్రైవేట్ ఎయిర్ లైన్స్ FLY91లో కమర్షియల్ పైలట్‌గా చేరారు. టర్బోప్రాప్ విమానాలతో గోవా, హైదరాబాద్, బెంగళూరు, పుణే, జల్గావ్, సింధుదుర్గ్ వంటి నగరాల మధ్య గోవా ఎయిర్‌లైన్ సేవలు అందిస్తోంది.
అభినందన్ వర్థమాన్ భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా సేవలందించారు. చిన్నప్పటి నుంచే వైమానిక దళంపై ఆసక్తితో ఎదిగిన అభినందన్, మిగ్-21 బైసన్ వంటి యుద్ధ విమానాలను నడిపిన అనుభవజ్ఞుడు.
2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. మరుసటి రోజు పాకిస్థాన్ ప్రతిదాడికి ప్రయత్నించగా, అభినందన్ తన MiG-21 Bisonతో జరిపిన వైమానిక పోరాటంలో ఆయన పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేశారు. అనంతరం ఆయన విమానం కూలిపోవడంతో పాకిస్థాన్ భూభాగంలో సైన్యానికి పట్టుబడ్డారు. ఆ సమయంలో వర్థమాన్ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ఒత్తిడి తీసుకురాగా, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య మూడు రోజుల తర్వాత భారత్‌కు అప్పగించారు.
ALSO READ : E20 పెట్రోల్‌తో భయపడాల్సిన పనిలేదు..
దేశ రక్షణలో చూపిన అసాధారణ పరాక్రమానికి గాను అభినందన్‌కు 2021లో వీరచక్ర పురస్కారం ప్రదానం చేశారు. ఇది భారతదేశ అత్యున్నత యుద్ధ శౌర్య పురస్కారాల్లో ఒకటి. అనంతరం ఆయన గ్రూప్ కెప్టెన్ హోదాకు పదోన్నతి పొందారు.
