తమిళనాడు సీఎం విజయ్ కీలక ప్రకటన చేశారు. తమిళనాడులో వరల్డ్ క్లాస్ మెగా ఒలింపిక్ సిటీ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా మోటర్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణంతో ఫార్ములా 1 ను చెన్నైకి వచ్చేలా చేయనున్నట్లు 2026 సెప్టెంబర్ 03న అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
ప్రపంచ ప్రమాణాలతో కూడిన తమిళనాడు ఒలింపిక్ సిటీని చెన్నైలో నిర్మించనున్నట్లు చెప్పారు విజయ్. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు, అత్యాధునిక క్రీడా పరికరాలు, ఒక ఉన్నత స్థాయి శిక్షణా కేంద్రం, ప్రత్యేక స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడికల్ సెంటర్స్ ఉంటాయని పేర్కొన్నారు. కోచ్ లకు వసతితో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు.
తమిళనాడు అథ్లెట్స్ ఒలింపిక్స్ లో ఎక్కువ మెడల్స్ అందుకునేలా తీర్చి దిద్దేందుకు ప్రాపర్ ట్రైనింగ్ తో పాటు.. అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నట్లు సీఎం విజయ్ చెప్పారు.
మోటార్ స్పోర్ట్స్ సిటీలో ఫార్ములా1-4 రేస్ లను చెన్నై సిటీలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. మోటార్స్ నడిపే యూత్ లో ఉన్న ట్యాలెంట్ గుర్తించి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. మోటార్ స్పోర్ట్స్ సిటీతో టూరిజం డెవలప్ అవుతుందని తెలిపారు. దీనితో పాటు ప్రత్యేక వాహనాల తయారీ పరిశ్రమలు రావడంతో, యువతకు ఉద్యోగాలు, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
2028 చివరాఖరి వరకు ఫార్ములా 1 రేసింగ్ ను దేశంలోకి తిరిగి తీసుకొస్తామని.. జూన్ నెలలో యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ మినిస్టర్ చెప్పారు. దీనికి సంబంధించి జూన్ లోనే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
