మానసిక సమస్యలపై మైండ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పో.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సలహాలు

మానసిక సమస్యలపై మైండ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పో.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సలహాలు

గచ్చిబౌలి, వెలుగు: పెరుగుతున్న మానసిక, భావోద్వేగ సమస్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ‘మైండ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పో–2026’ నిర్వహిస్తున్నట్లు ఎక్స్‌‌‌‌‌‌‌‌పో కన్వీనర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్​ సి.వీరేందర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. స్ఫూర్తి సోషల్‌‌‌‌‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌, యూ అండ్‌‌‌‌‌‌‌‌ మీ సంస్థల ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ కాలేజ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియాలో మూడు రోజుల పాటు ఎక్స్‌‌‌‌‌‌‌‌పో నిర్వహిస్తున్నారు. 

సమాజంలో మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై విస్తృత అవగాహన కల్పించడంతోపాటు, జీవితంలో ఎదురయ్యే మానసిక సవాళ్లను అధిగమించేందుకు నిపుణుల సలహాలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఎక్స్​పోకు ప్రవేశం ఉచితమని పేర్కొన్నారు.