బీసీ మంత్రిని బర్తరఫ్‌‌‌‌ చేయడం అన్యాయం

బీసీ మంత్రిని బర్తరఫ్‌‌‌‌ చేయడం అన్యాయం
  •     ఇద్దరు మంత్రులను బర్తరఫ్‌‌‌‌ చేసి కేసీఆర్‌‌‌‌ ఏం సాధించిండు?: జాజుల

హైదరాబాద్, వెలుగు: బీసీ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్‌‌‌‌ చేయడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌ అన్నారు. బీసీ మంత్రిపై నిరంకుశంగా వ్యవహరించడం కాంగ్రెస్‌‌‌‌ చేసిన పెద్ద తప్పిదమని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో బీసీ, ఎస్సీ మంత్రులను బర్తరఫ్‌‌‌‌ చేసిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో అందరికీ తెలుసన్నారు. 

పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్‌‌‌‌ కూడా ఇదే తీరుగా వ్యవహరించారని విమర్శించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన రాజయ్యను, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌‌‌‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌‌‌‌ చేసి కేసీఆర్‌‌‌‌ రాజకీయంగా నష్టపోయారని జాజుల శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌ గుర్తుచేశారు. ఇద్దరు మంత్రులను బర్తరఫ్‌‌‌‌ చేసి కేసీఆర్‌‌‌‌ ఏం సాధించారని ప్రశ్నించారు.