హైదరాబాద్, వెలుగు: విద్యారంగంలో విశేష సేవలు అందించిన ముగ్గురు అధికారులకు ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్-2026 అవార్డులు దక్కాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
టెక్నికల్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ. శ్రీదేవసేనతో పాటు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమేశ్ ఈ అవార్డులకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న జరిగే రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఈ ముగ్గురు అధికారులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు.
