సెప్టెంబర్8న ఓయూలో కీలకఘట్టం.. 109 ఏళ్ల ఓయూ చరిత్రలో 85వ స్నాతకోత్సవం

సెప్టెంబర్8న ఓయూలో కీలకఘట్టం..  109 ఏళ్ల ఓయూ చరిత్రలో 85వ స్నాతకోత్సవం

ఓయూ, వెలుగు: ఓయూ 85వ స్నాతకోత్సవాన్ని ఈనెల 8న ఠాగూర్‌‌‌‌‌‌‌‌ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు వీసీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ మొలుగరం తెలిపారు. గురువారం వర్సిటీలో రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ నరేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 109 ఏళ్ల ఓయూ చరిత్రలో 85వ స్నాతకోత్సవం కీలక ఘట్టంగా నిలుస్తుందన్నారు.

 గవర్నర్, ఓయూ చాన్సలర్​ శివ ప్రతాప్‌‌‌‌‌‌‌‌ శుక్లా అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి భారత్‌‌‌‌‌‌‌‌ బయోటెక్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌, చైర్మన్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ కృష్ణ ఎం.ఎల్లా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా 12 పీఠాలకు చెందిన పరిశోధకులకు 640 పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ డిగ్రీలు, విద్యా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 71 బంగారు పతకాలు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. స్నాతకోత్సవాన్ని ఓయూ అధికారిక యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ ఛానల్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వీసీ తెలిపారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోల చిత్రీకరణకు అనుమతి లేదని స్పష్టం చేశారు.