కాంగ్రెస్ నాయకుడి కారుకు నిప్పు.. పెట్రోల్ పోసి కాల్చేసిన దుండగులు

కాంగ్రెస్ నాయకుడి కారుకు నిప్పు.. పెట్రోల్ పోసి కాల్చేసిన దుండగులు

కుత్బుల్లాపూర్, వెలుగు: కాంగ్రెస్ కు చెందిన ఓ నాయకుడి కారుకు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్​స్టేషన్​పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

బౌరంపేట్​కు చెందిన నర్సారెడ్డి వీరారెడ్డి జీపీఆర్ ​లేఅవుట్​లోని తన ఆఫీస్​లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, ఆయన కారుపై పెట్రోల్ ​పోసి నిప్పంటించారు. వీరారెడ్డి గట్టిగా అరవడంతో పారిపోయారు.

కారు సగం వరకు కాలిపోయింది. పోలీసులు వచ్చి సీసీ ఫుటేజీ పరిశీలించారు. వ్యాపార లావాదేవీలా? లేదా రాజకీయ గొడవలు కారణమా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.