ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు మరో శుభవార్త. సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్‌కు కొత్త రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ ప్రత్యేక చొరవతో ఈ కొత్త రైలు మార్గం పట్టాలెక్కనుంది.
గడచిన పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే అభివృద్ధి సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు ఎంపీ వంశీ క్రిష్ణ. ముఖ్యంగా పెద్దపల్లి, మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి ప్రాంతాల ప్రజల రవాణా ఇబ్బందిని గుర్తించి ఈ కొత్త సేవలను తీసుకువచ్చారు.
ఇవాళ(సెప్టెంబర్ 4న) ఈ ట్రైన్ ట్రయల్ రన్ విజయవంతంగా ముగియనుండగా, రేపటి నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ద్వారా హైదరాబాద్ నుంచి కాగజ్ నగర్ మధ్య రాకపోకలు సాగించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ప్రయాణ సౌలభ్యం మరింత మెరుగవుతుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉత్తర తెలంగాణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కోరారు.
