మిరాకిల్.. వరదలతో టన్నెల్ మొత్తం బురద, రాళ్లతో మూసుకుపోయింది..గాలి లేదు, వెలుతురు లేదు.. లోపల అంతా బురదమయం.. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు తొమ్మిది రోజులు.. టన్నెల్ లో బతికి ఉండటమంటే మిరాకిలే.. నేపాల్ ప్రకృతి బీభత్సంలో బురదలో కూరుకుపోయిన జల విద్యుత్ కేంద్రం టన్నెల్ నుంచి ఇద్దరు సిబ్బందిని రెస్క్యూ టీం 9రోజుల తర్వాత సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
ఆగస్టు 26 న నేపాల్ సంభవించిన వరదల్లో రసువా జిల్లాలోని త్రిశూలీ3 జల విద్యుత్ కేంద్రం పూర్తిగా బురదతో నిండిపోయింది. ఈ విద్యుత్ కేంద్రం టన్నెల్ లో కొంతమంది సిబ్బంది చిక్కుకుపోయారు. అయితే టన్నెల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇన్ని రోజులు సాధ్యపడలేదు.శుక్రవారం రెస్య్కూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తుండగా లోపలినుంచి అరుపులు వినపడడంతో వారిని సురక్షితంగా బయటికి తీశారు. టన్నెల్ నుంచి రక్షించిన వారిలో మెకాలనికల్ ఫోర్ మెన్ సంజయ్ సాహ్, మెకానికల్ సూపర్ వైజర్ కబీర్ మఆర్జన్ గా గుర్తించారు.
త్రిశూలి 3 ఏ జల విద్యుత్ కేంద్రంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపలనుంచి ఇంకా అరుపులు వినిపిస్తుండటంతో మరికొందరు ఉండే అవకాశం ఉందని రెస్క్యూటీం చెబుతున్నాయి.
