ముంబై తీరంలో పడవ ప్రమాదం జరిగింది. గేట్ వే ఇండియా సమీపంలో అరేబియా సముద్రంలో ఇంజిన్ లో తలెత్తిన లోపంతో టూరిస్టు బోటు మునిగిపోయింది. నిన్న (సెప్టెంబర్ 3)రాత్రి తీరానికి ఒకటిన్నర నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బోటులో సిబ్బందితో సహా 38 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలోని టూరిస్టు పడవల సాయం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ప్రయాణికులతో పాటు, సిబ్బందిని అజాద్ హింద్ అనే టూరిస్టు పడవ సాయంతో ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
