ధనవంతుల క్లబ్ అది.. చికెన్ మటన్లో కూరగాయలు మిక్సింగ్.. 40 కేజీల చెడిపోయిన కారం..

ధనవంతుల క్లబ్ అది.. చికెన్ మటన్లో కూరగాయలు మిక్సింగ్.. 40 కేజీల చెడిపోయిన కారం..

రోజూ కల్తీ వార్తలు చూసిన చాలా మంది ఏమనుకుంటారు..? చిన్నా చితకా హోటళ్లకు వెళ్లొద్దు.. మహా అయితే వంద రూపాయలు ఎక్కువ అవుతాయేమో.. మంచి హోటల్లోనే తిందాం అనుకుంటుంటారు. ఇక ధనవంతుల అయితే.. మనం వెళ్లే రిచ్ హోటల్స్ హైజీనిక్ గా మెయింటైన్ చేస్తుంటాయిలే అనే భావనలో ఉంటుంటారు. కానీ ఇది చూస్తే అది రిచ్ అయినా.. గల్లీ రెస్టారెంట్ అయినా.. కల్తీ కల్తీనే.. కంపు కంపునే అనుకోక తప్పదు. బెంగళూర్ ధనవంతులు వెళ్లే ఛైర్మన్స్ క్లబ్ కిచెన్ బాగోతం ఎలా ఉందో ఓ లుక్కేయండి. 

కర్ణాటకలో ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు బ్యాక్ టూ బ్యాక్ రైడ్స్ తో దడ పుట్టిస్తున్నారు. బెంగళూరులో ఇప్పటికే కల్తీకి పాల్పడుతున్న హోటల్స్ పై దాడులు చేసి చర్యలు తీసుకున్నారు. లేటెస్టుగా 2026 సెప్టెంబర్ 3వ తేదీన బెంగళూరులో జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 

అత్యంత ధనవంతులు వెళ్లే ఛైర్మన్స్ ఫుడ్ క్లబ్ లో అధికారులు నిర్వహించన తనిఖీల్లో కల్తీ కహానీ బట్టబయలు అయ్యింది. డాలర్స్ కాలనీలోని శంకర్ నగర్ చైర్మన్స్ క్లబ్ లో నిబంధనలకు విరుద్ధంగా కల్తీకి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. 

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్ మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ వింగ్ జరిపిన తనిఖీల్లో 40 కేజీల పాడయిపోయిన కారం పొడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు లేబుల్స్ లేని బ్రెడ్ ముక్కలు, సాజీరా ను స్వాధీనం చేసుకున్నారు. 

కిచెన్, స్టోరేజ్ పరిస్థితులు చూసీ అధికారులు షాకయ్యారు. నిషేధించిన కలర్లు, కల్తీ ఆహార పదార్థాలను స్టోరేజ్ రూమ్ లో గుర్తించారు. అదే విధంగా పరిశుభ్రత లేకుండా ఈగలు, ఎలకలు తిరుగుతున్న కిచెన్ చూసి.. పేరుకే చైర్మన్స్ క్లబ్  అనే బ్రాండ్.. గల్లీ హోటళ్లలో ఉన్న పరిశుభ్రత కూడా లేదు కదా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వెజ్, నాన్ వెజ్ అంతా ఒక చోటే..

ఎంతో హైజీనిక్ గా మెయింటైన్ చేస్తుంది అనుకున్న రిచ్ హోటల్ ఇంత అధ్వాన్నంగా ఉండటం అధికారులను కలవరపెడుతోంది. శాఖాహారం, మాంసాహరం ఒకే చోట స్టోర్ చేయడం ఆందోళన కలిగించే అంశం. హైజీనిక్ పేరుతో జనాలు మోసం చేస్తున్న క్లబ్ కిచెన్ ను అధికారులు సీజ్ చేశారు.