శ్రీనగర్లో పార్కింగ్ స్తంభాన్ని ఢీకొట్టిన ఇండిగో ఫ్లైట్.. తప్పిన పెను ప్రమాదం

 శ్రీనగర్లో పార్కింగ్ స్తంభాన్ని ఢీకొట్టిన ఇండిగో ఫ్లైట్.. తప్పిన పెను ప్రమాదం

ముంబై నుంచి శ్రీనగర్ వెళ్లిన ఇండిగో ఫ్లైట్ కు పెను ప్రమాదం తప్పింది. పార్కింగ్ సమయంలో పోల్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎయిర్ పోర్ట్ అధికారులు, ప్యాసెంజర్లు ఆందోళనకు గురయ్యారు. 2026 సెప్టెంబర్ 4వ తేదీన ఉదయం 9.02 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రయాణీకులు బయటపడ్డారు.

నవీ ముంబై నుంచి శ్రీనగర్ వెళ్లిన 6E 225 ఫ్లైట్.. ఎయిర్ పోర్ట్ లోని విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ (VDTGS) స్తాంభాన్ని ఢీకొట్టింది. బే నెం.6 దగ్గర పార్క్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఫ్లైట్ లో ఉన్న ప్యాసెంజర్లను వెంటనే కిందికి దింపి సురక్షితంగా తరలించారు. ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ప్రకటించారు. 

ప్రమాద ఘటనకు గల కారణాలను పరిశీలిస్తా్మని ఇండిగో తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించనున్నట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు తెలిపారు.