పేరిణి శివతాండవం అంటే ఏంటి.?

పేరిణి శివతాండవం అంటే ఏంటి.?

     కాకతీయుల కాలంలో బాగా అభివృద్ధి చెందిన నృత్యకళ పేరిణి శివతాండవం.
    ఇది తెలంగాణ ప్రజల శాస్త్రీయ నృత్యం.
    పేరిణి నృత్యం సాధారణంగా పురుషులు చేస్తారు. ఇది శివునికి సంబంధించిన నృత్యం. 
    పేరిణి నృత్యాన్ని డ్యాన్స్ ఆఫ్ వారియర్స్ (యుద్ధవీరుల నృత్యం) అని కూడా అంటారు. 
    మగవారి పేరిణి నృత్యానికి ప్రతిచర్యగా ఆనందంతో పురుషులను రంజింపజేయడానికి స్త్రీలు చేసే నృత్యం లాస్యం. 
    పేరిణి నృత్యం కాకతీయ గణపతిదేవుని కాలంలో బాగా అభివృద్ధి చెందింది. 
    జయపసేనాని తన గ్రంథం నృత్యరత్నావళిలో పేరిణి నృత్య భంగిమలను పేర్కొన్నాడు. పేరిణి నృత్య భంగిమలు పాలంపేట రామప్పదేవాలయంపై చెక్కబడి ఉన్నాయి.
    కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన పేరిణి శివతాండవం నృత్యరూపాన్ని పునరుద్ధరించి వ్యాప్తి చేసింది– నటరాజ రామకృష్ణ.
    కాకతీయుల కాలంలో మరో ప్రసిద్ధ నృత్యం 

– కుండలాకార నృత్యం.

  •     తంతువాయిలు అనే ప్రత్యేక వాయిద్యగాళ్లు ఈ కాలంలో ఉండేవారు. 
  •     ధర్మసాగర శాసనం ప్రకారం కాకతీయుల కాలంలో జలకరందము అనే ప్రత్యేక వాయిద్యం ఉన్నట్లు తెలుస్తోంది.
  •     కాకతీయుల కాలంలో ప్రధానంగా అభివృద్ధి చెందిన నృత్య వినోదం తోలుబొమ్మలాట.