హైదరాబాద్: టాలీవుడ్లో కొరియోగ్రాఫర్ల నడుమ లొల్లి ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. తాజా పరిణామం ఏంటంటే.. రఘు మాస్టర్ ప్యానెల్‌పై జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసింది. బ్యాంకుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చారంటూ సుమలత ఆరోపించింది.
సుమలత ఆరోపణలపై రఘు మాస్టర్ కౌంటర్ ఇచ్చాడు. సుమలత పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రఘు మాస్టర్ ఫిర్యాదు చేశాడు. తమ కార్యవర్గాన్ని ఫెడరేషన్ గుర్తించిందని రఘు మాస్టర్ స్పష్టం చేశాడు.
ఫెడరేషన్ గుర్తింపు లేఖతోనే బ్యాంకును ఆశ్రయించామని తెలిపాడు. తాము ఇచ్చిన లేఖ ఆధారంగానే బ్యాంకు అనుమతించిందని చెప్పాడు. సుమలత ప్యానెల్‌ను ఫెడరేషన్ గుర్తించలేదని రఘు మాస్టర్ ఆరోపించాడు. సుమలత వ్యవహారంతో డాన్సర్స్ అసోసియేషన్ పరువు పోతోందని వ్యాఖ్యానించాడు.
అసోసియేషన్‌లో వివాదాలను సుమలత మరింత పెంచుతున్నారని రఘు మాస్టర్ విమర్శించాడు. త్వరలో డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు చేపడతానని రఘు మాస్టర్ ప్రకటించాడు.
►ALSO READ | Mirzapur: The Movie Review : గన్స్, గ్యాంగ్స్, పవర్ గేమ్.. 'మిర్జాపూర్ ది మూవీ' నెత్తుటి రాజకీయం ఎలా ఉందంటే?
