స్క్రీన్ టైమ్ ఇప్పుడు ఓ పెద్ద వ్యసనం లా మారింది. పిల్లలను వీడియో గేమ్ ల పట్ల కాకుండ మైదానంలో ఆడే ఆటల పట్ట ఆసక్తి చూపేలా ప్రోత్సహించాలని ప్రధాని మోదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఓ మేసేజ్ ఇచ్చారు.
టీచర్స్ డే సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీతలు అయిన టీచర్లతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్క్రీన్ టైమ్ ఇప్పుడు ఒకరకమైన వ్యసనంగా మారింది.. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ పిల్లలు ఆటల పట్ల.. అంటే వీడియోగేమ్ లు కాకుండా గ్రౌండ్ లో ఆడే నిజమైన ఆటపట్ల ఆసక్తి చూపడం ప్రారంభిస్తే వారు క్రమంగా ఆ వ్యసనం నుంచి విముక్తి పొందవచ్చని అన్నారు.
ఉపాధ్యాయులు పిల్లలను సృజనాత్మక కార్యకలాపాల వైపు మళ్లించాలన్నారు ప్రధాని. అందుకు ప్రోత్సహించే కార్యక్రమాలను రూపొందించాలని సలహా ఇచ్చారు. బాల్యం చాలా విలువైనది.. బాల్యాన్ని అంతరించిపోనివ్వకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లే అన్నారు ప్రధాని. పాఠ్యపుస్తకాలు, సిలబస్ లకు అతీతంగా పిల్లల జీవితాలతో మమేకం కావాలన్నారు.
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల వాడకం విపరీతంగా పెరిగిపోవడం వల్ల పిల్లలు వీటికి బానిసలవుతున్నారు. విద్యార్థుల్లో స్క్రీన్ టైం అనేది తీవ్రమైన వ్యసనంగా మారుతోంది. ఇది వారి శారీరక, మానసిక , విద్యాపరమైన ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రీల్స్ స్క్రోల్ చేయడం లేదా వీడియో గేమ్స్ ఆడటం వల్ల మెదడులో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది. ఇది తాత్కాలిక ఆనందాన్ని ఇస్తూ, పదే పదే స్క్రీన్ చూడాలనే వ్యసనానికి దారితీస్తుంది. పిల్లల్లో మానసిక సమస్యలు, కంటిచూపుపై ప్రభావం, నిద్రలేమి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
#WATCH | Delhi: While interacting with one of the National Awardee Teachers, Prime Minister Narendra Modi says, "...Screen time has now become a form of addiction. A thought occurs to me: if a child begins to take a keen interest in sports, and by sports, I don't mean video… pic.twitter.com/o7tnvSYOs0
— ANI (@ANI) September 5, 2026
