CSK New Captain: ఐపీఎల్ చరిత్రలోనే 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు గత మూడేళ్లుగా పెద్దగా కలిసిరావడం లేదు. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చెన్నై వరుసగా మూడు సీజన్లలోనూ లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. కెప్టెన్‌గా ఒత్తిడి పెరగడంతో రుతురాజ్ వ్యక్తిగత ప్రదర్శన కూడా క్షీణించడంతో తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకోవాలని, స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని మాజీ భారత క్రికెటర్ సదాగోపన్ రమేష్ సూచించారు.
సంజూ శాంసన్ కెప్టెన్సీ రికార్డ్:
రాజస్థాన్ రాయల్స్ జట్టును నడిపించిన అనుభవం సంజూ శాంసన్‌కు ఉందని సదాగోపన్ రమేష్ గుర్తు చేశారు. సీఎస్కే మేనేజ్‌మెంట్ కప్ కొట్టాలంటే తప్పకుండా ఈ మార్పులు చేయాల్సిందే.. కేవలం కెప్టెన్‌ను మార్చినంత మాత్రాన ట్రోఫీ రాకపోవచ్చు, కానీ కెప్టెన్సీ మార్చాలనుకుంటే సంజూ శాంసన్ పేరును ఖచ్చితంగా పరిశీలించాలని తన ఇన్స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో 66 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన సంజూ 33 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 50 శాతం విన్ రేట్ కలిగి ఉన్నాడని, అతని సారథ్యంలో రాజస్థాన్ ఒకసారి ఫైనల్‌కు, మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరిందన్నాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకోవడమే కాకుండా, సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సంజూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడని చెప్పుకొచ్చాడు.
సచిన్ లాగే రుతురాజ్ కూడా:
తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన రమేష్.. రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తే అది ఆయనకు, జట్టుకు రెండింటికి మేలు చేస్తుందన్నాడు. అనుభవం ఉన్న ఆటగాళ్లు మ్యాచ్ ఆడుతున్నప్పుడు కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకోవడం కష్టం.. గతంలో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ప్రదర్శన కూడా కెప్టెన్సీ వల్ల ప్రభావితమైంది. రుతురాజ్‌ను సారథ్యం నుంచి తప్పించడం ఎలాంటి కఠిన నిర్ణయం కాదు.. దీనివల్ల అతడు బ్యాటర్‌గా స్వేచ్ఛగా ఆడి పరుగుల వరద పారించగలడని వ్యాఖ్యానించాడు. మరి ఐపీఎల్ 2027 నాటికి సీఎస్కే యాజమాన్యం సంజూ శాంసన్‌కు జట్టు బాధ్యతలు అప్పగిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
CSK CAPTAINCY CHANGE INCOMING?
— CricBharat (@DilPrabhat88) September 5, 2026
Sanju Samson is being strongly backed to replace Ruturaj Gaikwad after a tough IPL 2026. (TOI) pic.twitter.com/sSJiTo2uoY
