హిందుత్వ ఇన్ ఫ్లూయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కేంద్ర మంత్రి, జన్ శక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్. తమ పేరును దుర్వినియోగం చేశారని.. చర్యలు తీసుకోవాలని కోరుతూ కంప్లైంట్ ఇచ్చారు. జులైలో కాక్రోచ్ పార్టీ నిరసనల్లో ఒక వ్యక్తి తల పగలగొట్టిన భరద్వాజ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు వెల్లడించారు.
భరద్వాజ్ తో తనకు గానీ, పార్టీకి గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదని 2026 సెప్టెంబర్ 04వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ యాక్టివిస్టుకు, గాయపడిన ఆమె తండ్రికి అండగా ఉంటుందని పేర్కన్నారు. తనతో పాటు ఇతర నేతల పేర్లను వాడుకుని.. ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించిన సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పబ్లిక్ లైఫ్ లో ఎంతో మంది తమను కలవడానికి వస్తుంటారు.. ఫోటోలు తీసుకుంటారు.. దాన్ని ఆధారంగా చేసుకుని పర్సనల్ పనులకు వాడుకోవడం, పేరును దుర్వినియోగం చేయడం తగదని అన్నారు. దాడి చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాము, తమ పార్టీ కాపాడుతున్నట్లు కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. తమ పేరు దుర్వినియోగంపై కంప్లైంట్ ఇచ్చినట్లు చెప్పారు.
ఏంటి కేసు..?
2026 జులై నెలలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సందర్భంగా రైట్ వింగ్ కార్యకర్త అయిన స్వతంత్ర భరద్వాజ్.. నిరసనకు వచ్చిన ఒక యువతి తండ్రి తల పగలగొట్టాడు. దాదాపు పుర్రె పగలగొట్టానని.. తనను ఎవరూ ఏమీ చేయలేరు.. దాదాపు సగం పుర్ర పగిలిందంటే ఇప్పటికే మర్డర్ కేసులో అరెస్ట్ కావాల్సి ఉందని.. కానీ తనపై యాక్షన్ తీసుకోలేరని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
ఈ దాడిలో ఆ వ్యక్తి తలపై 60 కుట్లు పడి తీవ్ర డ్యామేజ్ అయ్యింది. అయితే ఈ అతని తల పగిలింది.. 60 కుట్లు పడ్డాయంటే దాదాపు అటెంప్ట్ టు మర్డర్ కేస్.. కానీ నేను బయటనే తిరుగుతున్నా.. నన్నెవరూ ఏమీ చేయలేరు ఎందుకంటే నాకు ప్రధాని మోదీ, యూపీ సీఎం, కేంద్ర మంత్రి చిరాగ్ తదితరులు పోర్ట్ ఉన్నట్లు కామెంట్ చేశాడు.
దీనిపై ప్రతిపక్షాలు, సీజేపీ తీవ్రంగానే స్పందించాయి. జంతర్ మంతర్ నిరసనల్లో బీజేపీ, ఆరెస్సెస్ గూండాలను రంగంలోకి దింపాయని ఆరోపించాయి. మరోవైపు క్రిమినల్ కేసులు ఉన్న ఎందరో నిరసనల్లో ఉన్నారని.. ఢిల్లీ పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. దీనికి బలం చేకూర్చుతూ తన చేసిన పనిని సమర్ధించుకుంటూ మీడియా ముందు మాట్లాడటం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
