తమిళనాడు నుంచి వరంగల్ వ్యక్తికి హనీ ట్రాప్.. రూ.14.75 లక్షలు టోకరా.. 

తమిళనాడు నుంచి వరంగల్ వ్యక్తికి హనీ ట్రాప్.. రూ.14.75 లక్షలు టోకరా.. 

గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌, వెలుగు: ఓ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌ను హనీ ట్రాప్‌‌‌‌ చేసి రూ.14.75 లక్షలు మోసం చేసిన నిందితుడిని వరంగల్‌‌‌‌ సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన మణికంధన్‌‌‌‌ సెల్లముత్తు వై99 వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ‘లావణ్య’ పేరుతో వరంగల్‌‌‌‌కు చెందిన తుమ్మ ఉదయ్‌‌‌‌ కిరణ్‌‌‌‌(32)తో పరిచయం పెంచుకున్నాడు.

 మహిళగా నమ్మించి అతడితో సన్నిహితంగా మెలిగాడు. వివిధ అవసరాల పేరుతో మొత్తం రూ.14,75,100 ట్రాన్స్​ఫర్​ చేయించుకున్నాడు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఉదయ్​కిరణ్​ వరంగల్​ సైబర్​ క్రైం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. వరంగల్ పోలీసులు నిందితుడు మణికంధన్ ను తమిళనాడులోని సేలం జిల్లాలో 
అరెస్ట్ చేశారు.