నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ..అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం

నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ..అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం
  •     భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

చిట్యాల, వెలుగు: నిరుపేదలకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అండగా నిలుస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, కొత్తపల్లి గోరి  మండలాలకు చెందిన 94 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెక్కులు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధుల మంజూరులో నిర్లక్ష్యం, ఆలస్యం వల్ల పేదలు ఇబ్బందులు పడ్డారన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామన్నారు. 

అనంతరం చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కట్కూరు మొగిలి తండ్రి ఇటీవల చనిపోగా.. కుటుంబసభ్యులను పరామర్శించారు. చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, వైస్ చైర్మన్ రఫీ, మండల అధ్యక్షులు పున్నం రవి, ఓం ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్పంచ్ మౌనిక, తదితరులు పాల్గొన్నారు..