అలంపూర్, వెలుగు : ఐదవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ అమ్మవారు లక్ష గాజుల అలంకారంలో శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణమాసం 4వ శుక్రవారం జోగులాంబ అమ్మవారికి ఆలయ అధికారులు లక్ష గాజులతో అలంకరించినట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానికులే కాక సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు.
