- ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో 60 రోజుల ప్రత్యేక ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 100 మంది కానిస్టేబుల్, 100 మంది ఎస్సై అభ్యర్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు.
అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 5 నుంచి 11వ తేదీ వరకు బీసీ స్టడీ సర్కిల్, ఆదిలాబాద్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం చొప్పున, ఈబీసీ/ఈడబ్ల్యూఎస్/అనాథలను 25 శాతం ఎంపిక చేస్తామన్నారు.
రూ.3 లక్షల ఇన్‌కమ్ సర్టిఫికెట్‌తో పాటు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన పత్రం సమర్పించాలన్నారు. సెప్టెంబర్ 19 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. శిక్షణలో ఉచిత పుస్తకాలు, నిపుణులతో తరగతులు, పుస్తకాలు అందించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 8732-221280, 9949684959, 9494149416 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
