ఆదివాసీ గూడేల్లో 'మారుగోళ్ల' సందడి

ఆదివాసీ గూడేల్లో 'మారుగోళ్ల' సందడి

ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాల్లో కొడంగ్ (మారుగోళ్ల) సందడి ప్రారంభమైంది. శ్రావణమాసం మొదలు కావడంతో ఆదివాసీ గూడేల్లోని యువకులు, పిల్లలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రెండు కర్రలపై నిలబడి నడుస్తూ సందడి చేశారు. చుక్కల అమావాస్య నుంచి పోలాల అమావాస్య వరకు ఇలాగే నడక కొనసాగించనున్నారు. 

వానాకాలం అటవీ ప్రాంతాల్లో బురద ఎక్కువ. ఆ బురదలో కాళ్లతో నడిస్తే చర్మ సమస్యలు వస్తాయని, అవి రాకుండా ఉండేందుకే ఇలా మారుగోళ్లతో నడుస్తామని గిరిజనులు చెబుతున్నారు. నెల రోజుల తర్వాత గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి ఈ సంప్రదాయాన్ని ముగించనున్నారు. – వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్