సైన్స్లో పీజీ పట్టా ఉంటే గోల్డెన్ చాన్స్.. CSMCRIలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలు

సైన్స్లో పీజీ పట్టా ఉంటే గోల్డెన్ చాన్స్..  CSMCRIలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలు

సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్ - సీఎస్‌ఎంసీఆర్‌ఐ)లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్–I  1,  ఫీల్డ్ అసిస్టెంట్ 1, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1.

ఎలిజిబిలిటీ

ప్రాజెక్ట్ అసోసియేట్–I: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మైక్రోబయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లో ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి. సముద్ర, తీర ప్రాంత వాతావరణానికి సంబంధించిన ఈఐఏ, ఫీల్డ్ శాంప్లింగ్‌లో అనుభవం ఉండటం అదనపు అర్హతగా పరిగణిస్తారు.
ఫీల్డ్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జువాలజీ, మైక్రోబయాలజీ, లైఫ్ సైన్సెస్ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: లైఫ్ సైన్సెస్‌లో ఎంఎస్సీ పూర్తి చేయడంతోపాటు పారిశ్రామిక, విద్యా సంస్థలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థల్లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, శాస్త్రీయ సేవల విభాగంలో మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. మెరైన్ ఎన్విరాన్‌మెంట్‌కు సంబంధించి డేటా మేనేజ్‌మెంట్, మోడలింగ్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

ALSO READ : ఒక్క ఎగ్జామ్ తో స్పైసెస్ బోర్డులో ట్రైనీ పోస్టులు

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 23. 
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.csmcri.res.inను సందర్శించండి.