కోల్‌బెల్ట్/లక్సెట్టిపేట, వెలుగు: జపాన్ పర్యటన ముగించుకొని మంచిర్యాల జిల్లాకు వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ నేత మంతెన జగన్మోహన్రావు ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల లీడర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి లీడర్లతో కలిసి లక్సెటిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన మాజీ జడ్పీటీసీ ముత్తె సత్తయ్య, చందారం గ్రామంలో మాజీ ఎంపీపీ అన్నం మంగా-చిన్నయ్య దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు.
క్యాతనపల్లిలో మంచిర్యాల ఆర్డీవో గూడూరి శ్రీనివాస్ రావు–-సుధారాణి దంపతుల కొడుకు అరుణ్‌కుమార్–శ్రీజ, మంచిర్యాలలో కాంగ్రెస్ యూత్లీడర్ అరాకాల రమేశ్–నాగశ్వేత వివాహ వేడుకలకు మంత్రి వివేక్హాజరయ్యారు. ఇటీవల వివాహమైన మందమర్రి మండల కాంగ్రెస్ లీడర్లు పుల్లూరి లక్ష్మణ్–కళావతి దంపతుల కూతురు కీర్తన–-మనోజ్ కుమార్, మేడ రాజు–కవిత దంపతుల కొడుకు సాయికిరణ్–యోకె బెడుమేరి, లక్సెట్టిపేట మండల లీడర్లు మూల కిషన్ గౌడ్ కూతురు భవిత–మహేశ్ గౌడ్, నరేందుల సతీశ్ కొడుకు అన్వేశ్–ప్రజ్క్షశ్రీని ఆశీర్వాదించారు.
రామకృష్ణాపూర్‌కు చెందిన మాజీ ఎంపీపీ మహంకాళీ శ్రీనివాస్‌ను మంత్రి పరామర్శించారు. కోటపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచి మానుమండ్ల రమేశ్, వార్డు సభ్యులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
