నేపాల్ కు మరో భారీ ముప్పు పొంచివుంది. శనివారం ఉదయం చౌలానీ నదిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నదీ ప్రవాహం పాక్షికంగా నిలిచిపోయింది. స్టోరేజ్ అయిన నీరు ఒక్కసారిగా దిగువకు ప్రవహిస్తే ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నదీ పరివాహక, దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు. త్రిశూలీ నది విషాదం నుంచి నేపాల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఈ తాజా పరిణామం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు నేపాల్ లో త్రిశూలి నది వరద బీభత్సంతో మృతుల సంఖ్య 1300 దాటింది. వరదల్లో గల్లంతైన మరో 5వేల083 మంది ఆచూకీ లభించలేదని నేపాల్ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. టిబెట్ లో 21 మంది మృతిచెందగా, 541మంది గల్లంతైనట్లు నివేదికలు చెబుతున్నాయి
🇳🇵 #Nepal | Massive Landslide Partially Blocks River
— Siraj Noorani (@sirajnoorani) September 4, 2026
Continuous rains caused a massive landslide in the "Api Himal" area of Darchula District, leading to the partial closure of the Chamliya River's course and the formation of a temporary natural dam.
The water has begun carving… pic.twitter.com/D88hxfZJ0m
