ట్రంప్ కొత్త ప్రయోగం.. వైట్ హౌస్ సైట్లో వలస వ్యతిరేక గేమ్స్

ట్రంప్ కొత్త ప్రయోగం.. వైట్ హౌస్ సైట్లో వలస వ్యతిరేక గేమ్స్

వాషింగ్టన్: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ఒక కొత్త ప్రయోగానికి తెరలేపింది. వైట్ హౌస్ అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొన్ని ఆర్కేడ్-స్టైల్ గేమ్స్ ప్రారంభించింది. ఈ గేమ్స్ ద్వారా తమ రాజకీయ విధానాలను ప్రచారం చేసుకుంటోంది. ముఖ్యంగా, ప్రతిపక్ష డెమొక్రాట్లపై విమర్శలు చేయడానికి వీటిని ఒక ఆయుధంగా వాడుకుంటోంది.ఈ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఆర్కేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వలసలు, సరిహద్దు భద్రత, దేశభక్తికి సంబంధించిన గేమ్స్ ఉన్నాయి.

 'రియో రన్' అనే ఆటలో ప్లేయర్లు సరిహద్దు దాటేవాళ్లను బంధించాలి. ఇదొక వలసదారుల వ్యతిరేక వీడియో గేమ్. ఆటగాళ్లు రియో గ్రాండే నది ప్రాంతంలో గస్తీ కాస్తూ, సరిహద్దు దాటడానికి ప్రయత్నించే వారిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆటలో పట్టుబడిన వారందరూ ఖైదీల దుస్తులు వేసుకొని ఆటగాడి వెనుక నడుస్తున్నట్లు చూపిస్తారు. 

అమెరికా, మెక్సికో సరిహద్దులో అక్రమ వలసలను పూర్తిగా అడ్డుకోవడానికి, దేశ భద్రతను కాపాడడానికి దక్షిణ సరిహద్దు వెంబడి ఒక పెద్ద రక్షణ గోడను నిర్మించాలని ట్రంప్ మొదటి నుంచీ వాదిస్తున్న విషయం తెలిసిందే.